(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా - మల్లెలన్యూస్ ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    10, జూన్ 2026, బుధవారం

    ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా




    ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా

    రోటరీ ఇంటర్నేషనల్, LN-4 మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల కోసం చేపట్టబోయే "ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ ప్రాజెక్ట్" (Prosthetic Hand Project) గోడ పత్రికను (పోస్టర్) బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల  కలెక్టరేట్ నందు ఆవిష్కరించారు.
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాదాల వల్ల లేదా పుట్టుకతో చేతులు లేని వారికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వరమని కొనియాడారు. "ఆశను అందిస్తూ, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తూ..." (Providing Hope, Restoring Dignity) అనే నినాదంతో రెడ్ క్రాస్ మరియు రోటరీ సంస్థలు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    ఈ ఉచిత కృత్రిమ చేతులు కావలసిన వారు లేదా ఇతర వివరాల కోసం పోస్టర్‌పై ఉన్న సంప్రదింపు నంబర్ 8866 306 969 ను సంప్రదించవచ్చని  తెలిపారు. ఈ సమాచారాన్ని అర్హులైన పేద ప్రజలకు చేరేలా  సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
    ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మార్ శేషగిరిరావు వైస్ చైర్మన్ కె ఎం ఎన్ వి శ్రీనివాస గుప్తా, కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top