(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు - మల్లెలన్యూస్ మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    25, ఏప్రిల్ 2026, శనివారం

    మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు




    మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు


    పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం, మైదవోలు గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసరావు (తాత: నక్కా నాగేశ్వరరావు, తండ్రి: నక్కా గోవిందరాజు, తల్లి: నక్కా లక్ష్మి) గారు, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన యువకుడు, అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ కోచింగ్ కోర్సుకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
    ఏషియన్ వాలీబాల్ కాంటినెంటల్ (AVC) పరిధిలో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ (FIVB) డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చైనాలో జూలై 17 నుండి 24 వరకు నిర్వహించనున్న FIVB లెవల్-3 కోచెస్ కోర్సుకు భారతదేశం నుండి ఎంపిక కావడం విశేషం.
    ఈ సందర్భంగా NDA కూటమి మాజీ మంత్రి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ, ఈ లెవల్-3 స్థాయికి ఎదగడం అనేది భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) నక్కా శ్రీనివాసరావు ఒక రికార్డు సృష్టించినట్లే అని అభినందనలు తెలిపారు.
    అలాగే పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు, ఎడ్లపాడు సర్పంచ్ పోపూరి రాఘవయ్య గారు, ఈనాడు విలేకర్ పోపూరి రత్తయ్య గారు, చిలకలూరిపేట విజయ్ కుమార్ గారు (కరణం) అభినందనలు తెలియజేశారు.
    భారతదేశం తరఫున, ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఈ స్థాయి ఎంపిక సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, దేశానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు, ఎంతో మంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top