నటన, రాజకీయం, సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మల్లెల న్యూస్
నటుడు, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి నివాసంలో తెలుగుయువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అలాగే బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ఒకే వ్యక్తి నటన, రాజకీయం, సేవా రంగాల్లో సమానంగా రాణించడం చాలా అరుదని అన్నారు. తమ అభిమాన నాయకుడు, సహచర ఎమ్మెల్యే, సోదర సమానుడైన నందమూరి బాలకృష్ణ అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరని పేర్కొన్నారు.
నటనలో అగ్రస్థానాన్ని అందుకోవడంతో పాటు రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్న బాలకృష్ణ తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. ప్రజలు, అభిమానుల అపారమైన ప్రేమాభిమానాలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, టీడీపీ నాయకులు తుబాటి శ్రీహరి, కుమీర్, గట్టినేని సాయి, జాస్టి కిన్ను, కొత్త కోటేశ్వరరావు, మురకొండ మల్లిబాబు, చెవూరి కృష్ణమూర్తి, పిల్లి కోటేశ్వరరావు, తేలప్రోలు సాంబశివ, అమరా మణికుమార్, కొల్లిశెట్టి రంగా తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి