(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభించిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజ రాజేశ్వరి - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభించిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజ రాజేశ్వరి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    14, నవంబర్ 2026, శనివారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభించిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజ రాజేశ్వరి





    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి  కేంద్ర కార్యాలయం ప్రారంభించిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజ రాజేశ్వరి


     *పల్నాడు జిల్లా  చిలకలూరిపేట పట్టణ పరిధిలో 52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీలో సుమారు రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో హిందూ దేవాలయ నిర్మాణం  చేస్తున్న సందర్భంగా దానికి సంబంధించి కేంద్ర కార్యాలయము స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించడం జరిగింది*

    *సంస్థ జాతీయ అధ్యక్షులు  మల్లెల శివ నాగేశ్వరావు  మాట్లాడుతూ సంస్థ ప్రధాన  లక్ష్యమైన ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు మరియు హరిజన గిరిజనులు ఆలయ ప్రవేశాన్ని కోల్పోయారు వారి కోసమే  దేవాలయాలు నిర్మించాలని సదుద్దేశంతో టిట్కో హౌసింగ్ కాలనీలో దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని అలాగే సమస్త ద్వారా పేద ప్రజలకు పేద ప్రజల అభ్యున్నతికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు యువతి యువకులకు యోగ మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు వడ్డీ వ్యాపారస్తులకు కబంధహస్తాల నుండి పేద ప్రజలను కాపాడాలనే సదుద్దేశంతో పేద ప్రజల కోసం మైక్రో ఫైనాన్స్ ఏర్పాటు మన భారతీయ ప్రాచీన కళల ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహణ హెల్త్ క్లబ్ ఏర్పాటు గోశాల ఏర్పాటు ప్రకృతిని రక్షించే విధంగా ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా వృక్షజాతులతో అభివృద్ధి చేయటం తదితర కార్యక్రమాలన్నీ  దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తామని  మల్లెల శివ నాగేశ్వరరావు తెలియజేశారు*

     *సంస్థ కేంద్ర కార్యాలయం ప్రారంభించిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజరాజేశ్వరి గారు మాట్లాడుతూ సంస్థ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసారో ఆ ఫలితాలన్నీ పేద ప్రజలకు అందే విధంగా సంస్థలో పనిచేస్తున్న సభ్యులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న సంస్థ సభ్యులందరికి తెలియజేశారు*

     *ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అందరూ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను నిర్వీగ్నంగా కొనసాగాలని  ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు అలాగే సమస్త తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ ఈ సందర్భంగా సంస్థ సభ్యులను అభినందించారు*

      *ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజరాజేశ్వరి  జనసేన చిలకలూరిపేట సమన్వయకర్త శ్రీ తోట రాజా రమేష్  జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హసన్ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు శ్రీ పోలూరి శామ్మోహన్  తుళ్లూరుపేట బిజెపి పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ గోవింద శంకర్ శ్రీనివాసన్  చౌడవరపు రామారావు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్  ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య కోశాధికారి వంకాయలపాటి వంశీధర్ చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి తెలుగుదేశం నాయకులు ఇట్టే శివ నాగేశ్వరరావు బిజెపి నాయకులు దడబడ పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభించిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తోట రాజ రాజేశ్వరి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top