*'ప్రజాదర్బార్' పేరుతో ప్రజల సమస్యల పరిష్కార దిశగా అడుగులు*
*వారంలో ఒకరోజు 'ప్రజాదర్బార్' నిర్వహిస్తున్న మంత్రివర్యులు*
*ఆదివారం నిర్వహించిన 'ప్రజాదర్బార్'కు అనూహ్య స్పందన*
*వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన ప్రజలు*
*ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర*
*పలు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర*
*మచిలీపట్నం :*
రాష్ట్ర గనులు, భూగర్భవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 'ప్రజాదర్బార్' కార్యక్రమం ద్వారా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది.
ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు నియోజకవర్గ నలుమూలల నుండి వందలాది మంది ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ తరలివచ్చారు.
మంత్రి కొల్లు రవీంద్రను స్వయంగా కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న మంత్రి రవీంద్ర వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
అధికారులతో ఫోన్ లో మాట్లాడి చాలా సమస్యలకు అక్కడిక్కడే పరిష్కరించారు.
మరికొన్ని అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేసి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి