(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); డీఎస్సీ వాయిదా ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా - మల్లెలన్యూస్ డీఎస్సీ వాయిదా ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    11, జులై 2024, గురువారం

    డీఎస్సీ వాయిదా ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా



    *డీఎస్సీ వాయిదా ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా...*
    *బిఆరెస్ నాయకుల కుట్ర...*
     _-- గీకురు రవీందర్,_ _మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్._ 

    *చిగురుమామిడి జూలై 11, 2024:*
    డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలనే ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల యాజమాన్య మాఫియా హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ తీవ్రంగా విమర్శించారు.  బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పూరితమైన నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారని, కొంత మంది బిఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల ముసుగులో  విద్యార్థి సంఘాల  ఆందోళనలకు ఊతమిస్తున్నారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల  కాలములో నోటిఫికెషన్లు వేయక, ఉద్యగ ఖాళీలు భర్తీ చేయక నిరుద్యోగుల జీవితాలను నిర్వీర్యం చేసిన సంగతి మర్చిపోరాదన్నారు.  గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తె పేపర్ లీక్ అయ్యి వేలాది మంది విద్యార్థుల మనో వేదనకు కారణమయ్యారన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన కేవలం 5,089 ఖాళీలను ముఖమంత్రి రేవంత్ రెడ్డి 11,062 పెంచి మెగా డీఎస్సీగా ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే గ్రూవ్ 1, 2, 3 పరీక్షలకు నోటిఫికెషన్లతో పాటు  30వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేస్తుందన్నారు. పదేళ్ల పాటు ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయని ప్రభుత్వం మీదైతే, అనతి కాలములోనే 30 వేల పోస్టులు భర్తీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.  నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్న డీఎస్సీ వాయిదా వేయమనడంలో ఆంతర్యమెంటని, కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలను దోచిపెట్టడమేనా అని అన్నారు. ఉద్యోగాల భర్తీ గురించి, నిరుద్యోగ యువత ఉపాధి  గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. కనుమరుగవుతున్న పార్టీ ఉనికి కోసం ప్రాచుర్యం కోసం నిరుద్యోగ యువకుల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగుల పట్ల బిఆర్ఎస్ నాయకుల కపట ప్రేమను తెలంగాణ సమాజం నిషితంగా గమనిస్తుందన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: డీఎస్సీ వాయిదా ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top