AP: పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు
మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
టీడీపీ కీలక నేతలు, మంత్రులను కలిసి చర్చించినట్లు
సమాచారం. శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్
జకీయా ఖానం బుధవారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ని
కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో
నలుగురు ఎమ్మెల్సీలు సైతం టీడీపీతో టచ్ ఉన్నట్లు
సమాచారం. కాగా మండలిలో వైసీపీకి 38 మంది,
టీడీపీకి 9, జనసేనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి