(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రెస్ మీట్ - మల్లెలన్యూస్ సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రెస్ మీట్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    11, జులై 2024, గురువారం

    సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రెస్ మీట్



    సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి గారి ప్రెస్ మీట్

    పార్లమెంటు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వామపక్ష, లౌకిక,ప్రజాతంత్ర వాదులు, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు.

    రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం కాకుండా చూడడానికి అన్నీ పక్షాలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి దే.

    ........ సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

            ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపిని నిలువరించేందుకు ప్రజాస్వామ్య వాదులు,లౌకిక,ప్రజాతంత్ర వాదులు,వామపక్షాలు,ప్రజలంతా కలిసి బిజేపి కి తగిన గుణపాఠం చెప్పారని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు 
          చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా వామపక్షాలు లౌకికవాదులు అందరూ కలిసికట్టుగా పనిచేసే బిజెపిని ఓడించారని 400 పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాతో బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాలేదని, వీడియో కూటంలోని ఇతర పార్టీల సహకారంతో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారని, గతంలో వారు ఏకచిత్రాధిపత్యం చేసినట్లుగా ఇప్పుడు ఉండదని,రాజ్యాంగం కల్పించిన  లౌకికవాదాన్ని ను,రిజర్వేషన్ లను కాపాడుకోవడం కోసం ఎస్.సి, ఎస్టీ,బీసీ లు,మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ పనిచేస్తుందని,దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వామపక్షాలు ప్రత్యామ్నాయం అవుతాయని ఆ దిశగా కమ్యూనిస్టు పార్టీలు చర్చలు జరుపుతున్నాయని,దురదృష్టవశాత్తు దేశంలో కమ్యూనిస్టుల బలం తగ్గిపోవడంతో కార్మిక వర్గానికి,దోపిడీకి గురవుతున్న వర్గానికి,దళిత,పేద వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు జై రాం రమేష్ వ్యాఖ్యానించారని అన్నారు.
              డిసెంబర్ నాటికి సీపీఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు నిండ నున్నాయని,వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ ఈ వంద సంవత్సరాల్లో ప్రజల కోసం ఏం చేసింది,ఎన్ని విజయాలు సాధించిందో సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు వివరించనున్నట్లు వెంకటస్వామి తెలిపారు 

           తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు అధికారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదని,మొదటి ఐదు సంవత్సరాలు కెసిఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసినప్పటికీ రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దోపిడీ పెరిగిపోయిందని, నియంతృత్వ దోరణితో కుటుంబ పరిపాలనగా కొనసాగిందని ,అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించడానికి అన్ని వర్గాల ప్రజలు అనుకున్నారని,ప్రజలు బిజెపి ప్రత్యామ్నాయం అనుకున్నప్పటికి,మునుగోడు లో బిజెపిని ఓడించడానికి టిఆర్ఎస్ సీపీఐ సహాయం కోరగా ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి బిజెపిని ఓడించడం ప్రజలు గమనిచారని, నియంతలా వ్యవహరించిన కేసీఆర్ వ్యవహారశైలిని గమనించిన సీపీఐ పార్టీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినామని,పొత్తులో భాగంగా సీపీఐ కి ఒక్క సీటు ఇచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పోటీ చేయకుండా సంపూర్ణ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసామని,ఇచ్చిన ఒక్క సీటు గెలిచి అటు శాసన సభలో ఇటు ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నామని అన్నారు.

            ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 8 సీట్లు గెలుపొందగా, బిజెపికి గతంలో నాలుగు సీట్ల  ఉంటే అనూహ్యంగా  నాలుగు నుంచి ఎనిమిది సీట్లు గెలిచిందని అందుకు కాంగ్రెస్ పార్టీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసాడని,అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోక  అవినీతిపై కమీషన్లు వేసి,సీబీఐ విచారణ చేసి చట్టం తన పని తను చేసుకునే విధంగా చేయాలి  కానీ రేవంత్ రెడ్డి మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, పదే పదే కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం తో కింది స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తలు బిజేపి ప్రత్యామ్నాయం అని భావించి వారికి ఓటు వేశారని అన్నారు.
            దురదృష్టవ శాత్తు ఏ పార్టీ అయితే అధిరంలోకి రాకుడదో అదే బిజెపి అధికారంలోకి వచ్చిందని,బిజెపి ఎజెండా,వారి సిద్ధాంతం తెలియక,అవగాహన లేక దళితులు,గిరిజనులు,బలహీన వర్గాలకు చెందిన వారు ముఖ్యంగా యువత బిజేపి లో చేరుతున్నారని,కాంగ్రెస్ వైఫల్యాల మూలంగా బీజేపి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతున్నామని బీజేపి వారు చెప్పుకుంటున్నారని ప్రత్యామ్నాయం కాకుండా చూడాలన్నారు.
               రాష్ట్రంలో అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఒకవేళ పరిష్కారం చేయకపోతే  ప్రజల నుండి తిరుగుబాటు తప్పదన్నారు
               రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే కాంగ్రెస్ టిడిపి లకు చెందిన వారిని తన పార్టీలో చేర్చుకున్నారో రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నాడని,ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అభివృద్ధి కోసం  పార్టీలు మారుతున్నామని చెప్పడం సిగ్గు చేటని,ఒకవేళ అభివృద్ధి కోసమే అయితే ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ప్రజల చేత ప్రజాస్వామ్య యుతంగా ఉద్యమించాలి తప్ప పార్టీలు మారడమెంటని ప్రశ్నించారు 
    పార్టీలు మరాలనుకుంటే శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మారాలని,అప్పుడే ఇతర పార్టీలకు వెళ్ళాలని,పార్టీ ఫిరాయింపులకు సీపీఐ వ్యతిరేకమని తెలిపారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు 
                  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఉండాలని ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై నియంత్రణ లేదని ఇప్పటికైనా పరిపాలన పై దృష్టి కేంద్రీకరించాలని లేని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని వెంకటస్వామి తెలిపారు
                  ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్,జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి,బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య,సీనియర్ నాయకులు తేరాల సత్యనారాయణ, రాకం అంజవ్వ ఉన్నారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రెస్ మీట్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top