దక్షిణ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిం ది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు.
అక్కడి స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజధాని లిమా నుంచి 40 మందికిపైగా ప్రయాణికుల తో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ఘటనాస్థలా నికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు.
పర్వత రోడ్లు, వేగంగా వెళ్ల డం, రోడ్లు సరిగ్గా లేకపోవ డం, ట్రాఫిక్ సంకేతాలు లేకపోవడం వంటి కారణాల వల్ల పెరూలో తరచూగా రోడ్డు ప్రమాదాలు జరుగు తుంటాయి.
గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో ఆ దేశంలో మొత్తం 3,100 మంది ప్రాణాలు కోల్పోయారు...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి