సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపిన కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ సంఘ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు
చిలకలూరిపేట:
ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న జర్నలిస్టులను బెదిరించటం, వారిపై భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు స్పందించటం హర్షనీయమని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ సంఘ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు అన్నారు.
గతం నుంచి కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారి అభ్యన్నతి కోసం పాటుపడుతుందని, జర్నలిస్టులపై దాడులు అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకువచ్చి రక్షణ కల్పించాలని ఉద్యమిస్తుందని మల్లెల శివనాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు ప్రజా ప్రతినిధులను కలసి వినతి పత్రాలు అందించామని వెల్లడించారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని, దాడులకు పాల్పడేవారిపై శిక్షలు కఠిన తరం చేస్తామని హామీ ఇవ్వడం జర్నలిస్టు లోకం హర్షిస్తుందన్నారు. జర్నలిస్టుసై స్పందించిన వీరికి మల్లెల శివనాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి