గునుకుల కిషోర్
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం, గోమతి నగర్ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నాలుగో విడుదల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...
క్రియశీలక సభ్యత్వం స్టార్ట్ చేసిన మొదట్లో గుండెల పై జనసేన పార్టీ ఐడి వేసుకోవడానికి ఎంత గర్వంగా భావించామో.. ఈరోజు పార్టీ గెలిచిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడానికి అంతే గర్వంగా భావిస్తున్నాం...
నూటికి నూరు శాతం గెలిచిన తర్వాత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అప్పజెప్పిన బాధ్యతను జనసేన నాయకులు,వీర మహిళలు జనసైనికులు బాధ్యతగా,ముందుకు తీసుకుపోండి.
గడిచిన సంవత్సర కాలంలో జనసేన పార్టీకి వచ్చిన ఆదరాభిమానాలు మరువలేనివి.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఎప్పుడెప్పుడు అని అడిగిన ప్రతి ఒక్కరిని సభ్యత్వం లో కలుపుకుంటూ అత్యధిక జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులను చేయండి.
జాతీయ మీడియా ప్రతినిధి నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం 9500ఉన్న సభ్యత్వాన్ని 50 వేలు దాకా తీసుకెళ్లేందుకు మేమంతా కృషి చేస్తాం...
క్రియాశీలక ప్రారంభించినప్పటి నుండి నుంచి దాదాపు 344 మందికి ఐదు లక్షలొప్పున చొప్పున 18 కోట్లు ప్రమాద బీమా ఇప్పటివరకూ అందించడం జరిగింది. ఇంకా 90 మందికి ఇవ్వవలసి ఉంది...
ఈనెల 18 నుంచి 28 దాకా ప్రతిష్టాత్మకంగా ఒక మహా యజ్ఞం లాగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయండి.
ఈ సభ్యత్వానికి ఒక ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు మరియు నామినీ ఆధార్ కార్డు,వాలంటీర్ల కు అందిస్తే ఐడి కార్డుతో పాటు క్రియాశీలక సభ్యత్వ కిట్ జిల్లా కార్యాలయంలో అందజేయబడుతుంది.
ఈ సభ్యత్వం తీసుకున్న వారికి జనసేన మద్దతు దారులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటలైజేషన్ 50 వేల రూపాయలు అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ లభించడమే కాకుండా జనసేన పార్టీ కమిటీ లలో ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయ ఇన్చార్జి జమీర్,జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్,శ్రీరామ్, కృష్ణారెడ్డి,రవి,నాగరత్నం యాదవ్,శ్రీపతి రాము,శేఖర్ రెడ్డి ఇతర సిటీ కోర్ పార్టీ కమిటీ కోర్ కమిటీ సభ్యులు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి