భార్యను కాపాడే యత్నంలో భర్త దుర్మరణం
నంద్యాల జిల్లా ఎర్రగుంటలో ప్రమాదం
నాలుగు నెలల కిందటే ప్రేమ పెళ్లి
అంతలోనే ఘోర విషాదం
కునికిపాటుతో రైలు నుంచి పడిపోతున్న భార్యను కాపాడే ప్రయత్నంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సహచర ప్రయాణికులను కుదిపేసిన ఈ దుర్ఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియా భాను ప్రేమించుకున్నారు. నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. గుంటూరు నుంచి బెంగళూరకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య అసియాబాను ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణిస్తుండగా ఎర్రగుంట్ల వద్ద నిద్రమత్తులో అసియా భాను రైలులో నుంచి కిందపడి పోయింది. ఈ హఠాత్పరిణాయంతో ఆసిఫ్ ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకాడు.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ మహిళకు తీవ్ర గాయాలు కాగా రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి