(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మైనర్‌పై అఘాయిత్య కేసులో రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన పోలీసులు - మల్లెలన్యూస్ మైనర్‌పై అఘాయిత్య కేసులో రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన పోలీసులు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    9, జూన్ 2026, మంగళవారం

    మైనర్‌పై అఘాయిత్య కేసులో రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన పోలీసులు






    మైనర్‌పై అఘాయిత్య కేసులో రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన పోలీసులు

    కర్ణాటక రాష్ట్రంలోని లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చెత్త సేకరించి జీవనం సాగించే ఓ మహిళ కుమార్తె (మైనర్)పై అఘాయిత్యం జరిగిన కేసులో చార్జ్‌షీట్‌ను బాధితులకు అనుకూలంగా నమోదు చేయాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని స్టేషన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    కూతురిపై జరిగిన ఘటనతో ఇప్పటికే తీవ్ర మనోవేదనలో ఉన్న బాధితురాలి తల్లిని పోలీసులు డబ్బుల కోసం వేధించడంతో ఆమె సామాజిక కార్యకర్తల సహాయంతో లోకాయుక్త అధికారులను ఆశ్రయించింది.

    ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు ఉచ్చుపన్ని, బాధితురాలి నుంచి జ్యోతి లంచం స్వీకరిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై శివశరణప్ప పరారైనట్లు సమాచారం.

    ఈ ఘటన పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఉండగా, న్యాయం చేయాల్సిన అధికారులు లంచం డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం లోకాయుక్త అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మైనర్‌పై అఘాయిత్య కేసులో రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన పోలీసులు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top