ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా "మా నామ్ కే ఏక్ పేడ్" కార్యక్రమం విజయవంతం
చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని "మా నామ్ కే ఏక్ పేడ్" (అమ్మ పేరు మీద ఒక మొక్క) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా నిర్మించిన రోడ్డు పక్కన మరియు కస్తూరిబాయ్ గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
జూన్ 5న నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మరియు చిలకలూరిపేట రూరల్ మండల ఇంచార్జ్ మల్లెల శివ నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు పఠాన్ యాసిన్, కస్తూరిబాయ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బ్రహ్మాజీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని, "మా నామ్ కే ఏక్ పేడ్" వంటి కార్యక్రమాలు సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
– ప్రెస్ రిలీజ్
బీజేపీ, చిలకలూరిపేట రూరల్ మండలం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి