(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం జనతా వారధి వినతి - మల్లెలన్యూస్ గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం జనతా వారధి వినతి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, జూన్ 2026, సోమవారం

    గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం జనతా వారధి వినతి


    గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం జనతా వారధి వినతి

    పల్నాడు, జూన్ 8: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ గారి సూచనల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి బృందం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి గీత కులాల గౌరవం, పర్యావరణ పరిరక్షణ మరియు స్వావలంబన కోసం వినతిపత్రం సమర్పించారు.

    ఈ సందర్భంగా జనతా వారధి ప్రతినిధులు మాట్లాడుతూ, తరతరాలుగా తాటి చెట్ల ఆధారంగా జీవిస్తున్న గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత తదితర గీత కులాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. తాటి చెట్టు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా, పర్యావరణ పరిరక్షణకు సహజ రక్షకుడిగా, వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

    ప్రస్తుతం గీత వృత్తి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, తాటి చెట్ల సంఖ్య తగ్గిపోవడం, వృత్తికి తగిన ప్రోత్సాహం లేకపోవడం, యువత దూరమవడం, ఎక్సైజ్ చట్టాల కారణంగా ఇబ్బందులు ఎదురుకావడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

    వినతిపత్రంలో తాటి చెట్ల సంరక్షణ, ఎక్సైజ్ చట్టాల పునఃసమీక్ష, నీరా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు, భారీ స్థాయిలో తాటి మొక్కల పెంపకం, పామ్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అమలు, గీత వృత్తిదారుల సంక్షేమ కార్యక్రమాలు, విద్యా మరియు ఉపాధి అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత వంటి అంశాలను ప్రస్తావించారు.

    అలాగే గీత వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాకుండా, మన సంస్కృతి మరియు గ్రామీణ జీవన విధానానికి ప్రతీక అని పేర్కొంటూ, గీత కులాల ఆదిపురుషుడిగా భావించే కౌండిన్య మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.

    ఈ సందర్భంగా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బందెల శ్రీనివాసరావు గారు తమ హరిజనవాడలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం అందించిన ఫిర్యాదును సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు అందజేశారు. అదేవిధంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులను సంబంధిత అధికారులకు సమర్పించారు.

    ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్, జిల్లా మీడియా ఇన్‌చార్జి కోమటి వాసు, నరసరావుపేట టూ టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పవరపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం జనతా వారధి వినతి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top