నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆజ్ఞ అనుసారం మండల అధ్యక్షులు మున్వర్ బాజీ మరియు బీజేపీ నాయకులు అందరూ నకరికల్లు పీహెచ్‌సీని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే బీజేపీ నేతలు నకరికల్లు మండల పీహెచ్‌సీ లొని ప్రజా సమస్యల పై జనతా వారధి కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలపై సమాచారం తెలుసుకున్నారు. చలి కారణంగా దగ్గు, జలుబు చికిత్సలు, కుక్కకాటు, పాముకాటు వైద్యం, రక్తపరీక్షలు, నెబ్యులైజేషన్ సేవలు ఉన్నాయని డా. హసీనా తెలిపారు. అనంతరం పలు సమస్యలను తెలియపరిచి చర్చించారు. ఈ కార్యక్రమంలో వారధి కమిటీ కన్వీనర్ కోటపాటి వీరాంజనేయులు, కో-కన్వీనర్ ఇర్ల నాగరాజు, మేరాజ్యోత్ అంజి నాయక్, రావుట్ల సాంబాచారి మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి