క్రోసూరు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా క్రోసూరు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలకు మేరకు ,జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి సూచనలు మేరకు, ఈరోజు పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పంట కాలువలో వేస్తున్నటువంటి డంపింగ్ ని తక్షణమే తీసివేసి ఆ పంట కాలవ మీద ఆధారపడి ఉన్న సుమారు 500 ఎకరాల సాగుభూమిని మరల సాగులోకి తేవాలని ఆ గ్రామానికి చెందిన రైతు పోసి పోగు చిన్న వెంకయ్య గారు ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో అర్జీ ఇవ్వడమైనది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దమ్మాలపాటి శ్రీనివాసరావు , వి బి జి రామ్ జి పల్నాడు జిల్లా కన్వీనర్ నారు శ్రీనివాసరెడ్డి,జనతా వారది కన్వీనర్ తుమ్మపూడి వెంకటేశ్వర రెడ్డి, కోకన్వీనర్ వెంకయ్య, మరొక కో కన్వీనర్ కంటూ సాయి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వీరంకి వీరబాబు, సీనియర్ నాయకులు , క్రోసూరు వేణుగోపాలరావు, రైతు వేణు డాక్టర్ నరసింహారాజు గారు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి