(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); కార్పొరేట్ సంస్థలని పోషిస్తున్న బిజెపి - మల్లెలన్యూస్ కార్పొరేట్ సంస్థలని పోషిస్తున్న బిజెపి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

    కార్పొరేట్ సంస్థలని పోషిస్తున్న బిజెపి









    దేశ ప్రజల గోడు పట్టని బిజెపి.

    కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.

    సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ 

    సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో,ధర్నా.


    కేంద్రంలో రెండవ సారి  అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం  అడ్డగోలుగా వంటనూనెలు,పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువులను అడ్డగోలుగా నిల్వలను చేసి అడ్డు అదుపు లేకుండా అధికంగా ధరలను పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలను దొచిపెట్టి  కార్పొరేట్ శక్తులకు పంచి పెట్టి దేశ ప్రజలపై నేను భారం మొపుతున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు.
    శుక్రవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిత్యావసర వస్తువుల ధరల పేరుగుదలకు నిరసనగా సిపిఐ హుస్నాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ప్రజలు సిపిఐ కార్యకర్తలతో కలిసి భారీ  ధర్నా రాస్తారోకో చేపట్టగా ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

    ధర్నా రాస్తారోకో ముగిసిన అనంతరం ప్రజల మధ్య కార్యకర్తలను ఉద్దేశించి గడిపె మల్లేశ్ మాట్లాడుతూ పేదల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎన్నికల ముందు దేశ ప్రజలకు హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చిన బిజెపి  ప్రభుత్వం ఓ వైపు కార్పొరేట్ సంస్థలు తీసుకున్న లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, దేశానికి అన్నం పెట్టే రైతులపై ఉక్కుపాదం మోపుతు ప్రజల జెబులు చిల్లు చేసే జిఏస్టిని తెచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని  బిజెపి పాలకుల విధానాలపై గడిపె మల్లేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని తెలంగాణ రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు సరిపడ నిలువ ఉన్నప్పటికీ కృత్రిమ కొరతను సృష్టించి బడా వ్యాపారులు అధిక ధరలను పెంచుతున్నారని గడిపె మల్లేశ్ ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని, తెలంగాణలొ కృత్రిమ కొరతాను సృష్టిచి నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పసిగట్టి అధిక ధరలకు అమ్మకం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఆందోళనలు ఉదృతం చేస్తామని గడిపె మల్లేశ్ అన్నారు.ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, పిట్టల బాలయ్య,
    ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్,
    సిపిఐ మండల నాయకులు పొదిల కుమారస్వామి, పిట్టల ప్రసాద్,ఎండి అక్బర్,
    అయిలేని మల్లారెడ్డి,మౌటం బాలయ్య,చెప్యాల సమ్మయ్య,బింగి సమ్మయ్య,పొదిల కనకస్వామి, వంగపెల్లి వెంకటయ్య,కాల్వల ఎల్లయ్య,
    భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు జంగ విజయ,దొంతరవేని రాజవ్వ,మేకల విజయ, దొంతరవేని రజిత,ఇల్లందుల సత్యవతి,
    దొంతరబొయిన అనిత,ముక్కేర వెంకటలక్ష్మి,మర్యాల సులోచన,అందే భవాని,
    తదితరులు పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కార్పొరేట్ సంస్థలని పోషిస్తున్న బిజెపి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top