(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మోద్దు నిద్ర వేయడని విద్యాశాఖ - మల్లెలన్యూస్ మోద్దు నిద్ర వేయడని విద్యాశాఖ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

    మోద్దు నిద్ర వేయడని విద్యాశాఖ




    మొద్దూనిద్ర వీడని విద్యాశాఖ - పసిపిల్లలతో ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు

    సిపిఐ (యం యల్ )లిబరేషన్ పార్టీ

    జిల్లా నాయకుడు గాలి రవిరాజ్

    నంద్యాల జిల్లా అయినప్పుడు నుండి విద్యాశాఖ అధికారులు మొద్దునిద్ర పోతుండడంతో లక్షలకు లక్షలు ఫీజులు దొబ్బుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కలుసిత ఆహారం పెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఘాటుగా విమర్శించారు నంద్యాల పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తిని తినక పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు చెల్లెస్తున్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రం గర్భశోఖం మిగులుస్తున్న ప్రైవేట్ స్కూలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమైయ్యారని వారు అధికారులను విమర్శించారు ఆ మొన్న గుడ్ షేపర్డ్ స్కూల్ నందు నిర్భంద విద్య వలన స్కూల్ భవనం పైనుండి దూకడం మొన్న శాంతినికేతన్ స్కూల్ లో ఫుడ్ ఫాయిజన్ నిన్న SDR స్కూల్ నందు ఫుడ్ ఫాయిజన్ మరి రేపు ఎక్కడో అన్నట్లుగా వున్న ఇంత జరుగుతున్న ఆ విద్యా సంస్థలపై కనిసం అధికారులు వచ్చి ఎంకవైరీ చేసిన పాపన లేదన్నారు నంద్యాలలో జిల్లా కలెక్టర్ న్యాయశాఖ మంత్రి వున్న ప్రైవేట్ స్కూల్ పై చర్యలు శూన్యమేనని వారు విమర్శించారు అసలు నంద్యాల జిల్లాలో ఎన్ని విద్యాలయాలకు అనుమతులు వున్నాయో అలాగే ఆట స్థలాలు సరైన సౌకర్యాలు హాస్టల్లో వసతులు సరిగా ఉన్నాయా లెవా అని ఏ రోజయినా ఏ అధికారైన సోదాలు నిర్వహించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు మొక్కుబడిగా ఒక సంఘటన జరిగితే పూర్తిగా విచారణ చేయాల్సిన అధికారులే ముడుపులు ముడుతే చాలు అన్న చందంగా తూ తూ మంత్రాంగ  విచారణ జరిపామని చెబుతున్నారే తప్ప జరిగిన సంఘటనకు బాధ్యులే లేరని చెప్పడం నిసిగ్గుగా ఉందన్నారు ప్రైవేట్ స్కూల్ అని రేకుల షెడ్డులలో బాతురూం కూడా లేని స్కూల్ వున్నాయని అధికారులకు తెలియదా అని వారు ఆరోపించారు మొక్కుబడిగా విచారణలు కాదు బాద్యులపై చర్యలు లెవా అని వారు సూటిగా ప్రశ్నించారు ఇక కళాశాలలకు వస్తే ల్యాబ్లు కూడా లేకుండానే పాఠాలు బోదిస్తున్నారు ఇకానైనా అధికారులు మొద్దునిద్ర వీడి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షo లో సిపిఐ (యం యల్ )లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్పడతామని వారు హితువు పలికారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మోద్దు నిద్ర వేయడని విద్యాశాఖ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top