(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన కారణంగా మే 2, 2025 న ఈ క్రింది విదంగా ట్రాఫిక్ మళ్లింపులు చేయబడును. - మల్లెలన్యూస్ శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన కారణంగా మే 2, 2025 న ఈ క్రింది విదంగా ట్రాఫిక్ మళ్లింపులు చేయబడును. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    29, ఏప్రిల్ 2025, మంగళవారం

    శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన కారణంగా మే 2, 2025 న ఈ క్రింది విదంగా ట్రాఫిక్ మళ్లింపులు చేయబడును.





    డీజీపీ కార్యాలయం, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్.

    విషయం : ట్రాఫిక్ మళ్లింపులు

    గౌరవనీయలు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన కారణంగా మే 2, 2025 న ఈ క్రింది విదంగా ట్రాఫిక్ మళ్లింపులు చేయబడును.

    మే 2, 2025న ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి. అమరావతిలో శంకుస్థాపన కోసం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పర్యటన మరియు సంబంధిత బహిరంగ సభ సజావుగా సాగడానికి జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రజల సౌకర్యం కొరకు ఈ క్రింద విదంగా ట్రాఫిక్ మళ్లింపులు చేయబడును.

    *భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు :*

    *ట్రాఫిక్ మళ్లింపులు (భారీ మరియు ఇతర వాహనాలతో సహా) :*

    1. చెన్నై వైపు నుండి విశాఖపట్నంనకు వయా విజయవాడ మీదుగా మరియు ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపుకు వెళ్ళు భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల- బాపట్ల - రేపల్లె - అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది. (అదే విదంగా విశాఖపట్నం నుండి చెన్నై వైపు వాహనములు వెళ్లవలెను) ఇదే మార్గం గుండా
    2. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

    3. చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

    4. గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి - వేమూరు- కొల్లూరు - వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

    5. గన్నవరం వైపు నుండి హైదరాబాద్ కు వయా ఆగిరిపల్లి - శోభనాపురం గణపవరం వెళ్ళవలెను. మైలవరం జి. కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా

    6. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు: హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు - మైలవరం జి. కొండూరు - ఇబ్రహీంపట్నం వైపు భారీ గూడ్స్ వాహనాలు వెళ్ళవలెను. ( అదే విదంగా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపు ఇదే మార్గం గుండా వెళ్లవలెను)

    *మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సూచనలు :*

    చెన్నై నుండి విశాఖపట్నం: ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు మరియు నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా నిలిపివేయబడతాయి.

    విశాఖపట్నం నుండి చెన్నై: ఈ వాహనాలు హనుమాన్ జంక్షన్ మరియు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేయబడతాయి.

    ఆగిన అన్ని మల్టీ-యాక్సిల్ వాహనాలు మే 2, 2025 న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతించబడతాయి.

    ఈ సమయంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరుతున్నాము.

    మీడియా వారికి విజ్ఞప్తి: ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు FM స్టేషన్లు యొక్క ఎడిటర్లు మరియు డైరెక్టర్లందరికీ ప్రజల భద్రత దృష్ట్యా విస్తృత ప్రచారం/టెలికాస్ట్ చేయమని అభ్యర్థిస్తున్నాము.

    ట్రాఫిక్ మళ్లింపుల దృశ్య ప్రాతినిధ్యం కోసం చూడగలరు. జతచేయబడిన మ్యాప్ను

    *డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్*
    *మంగళగిరి*
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన కారణంగా మే 2, 2025 న ఈ క్రింది విదంగా ట్రాఫిక్ మళ్లింపులు చేయబడును. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top