ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నూతన కార్యవర్గం.
శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులుగా డోల శంకర్ రావు, డా.తిత్తి ప్రవీణ్ కుమార్.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) జర్నలిస్టు మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గొండు శంకర్, తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు పాల్గొనగా రాష్ట్ర నాయకులు, ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి, ఐజేయు రాష్ట్ర నాయకులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా అధ్యక్షులుగా డోల శంకర్రావు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా డా.తిత్తి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ముగ్గురిని ఎన్నుపోగా అందులో పేడాడ హేమ సుందర్, అరసాడ దిలీప్, చల్లా గణపతి, బెహరా షణ్ముఖరావు లు ఎన్నికయ్యారు. అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా అద్దంకి సురేష్, బొడ్డేపల్లి రాజేశ్వరరావు, ఆర్ వి పట్నాయక్ ను ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కోశాధికారిగా ఆకుల మాధవను ఎంపిక చేయగా ఇంకా సభ్యులుగా 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా గొండు జనార్ధన్, జగదీష్ ఏ, టి గోవింద్, దవల కిరణ్, అనుపాల మోహన్, పిట్ట మోహన్, కొంగరపు చిన్నవాడు, చింతాడ బాలకృష్ణ, బి శ్రీనివాస్, జామి శ్రీనివాస్, కే సత్యనారాయణ, ఏ ఉమామహేశ్వరరావు, పి కృష్ణమోహన్, బి యోగేశ్వరరావు (టెక్కలి), పి రామ్మోహన్ (నరసన్నపేట) సభ్యులుగా ఎన్నుకోగా.. ఇక మీడియా సెల్ లీగల్ అడ్వైజర్గా గుండబాల మోహన్ తో పాటు ఎస్సీ,ఎస్టీ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్ మీడియం ఫెడరేషన్ అనుబంధ సంస్థ) ను కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీ సెల్ మీడియా అధ్యక్షుడిగా వి రాము, కార్యదర్శిగా బలగా మోహన్, కోశాధికారిగా ఎం బాలకృష్ణ ఈ కార్యవర్గం అంతటికీ గౌరవ అధ్యక్షుడిగా డా.డోల అప్పన్న, గౌరవ సలహాదారుడిగా ఓంపురి రమేష్ ను నియమించడం జరిగింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి