అక్రమ కట్టడాలతో అగచాట్లు
కాకినాడ సూర్యనారాయణ పురం రైల్వే గేటు దగ్గర రోడ్డు మీద కంకర ఇసుక ఐరన్ ఇష్టారాజ్యంగా వదిలేసిన తీరుగా నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణం జోరుగా సాగుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ప్రజలకు పాదచారులకు వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా నిర్మాణాలు జరగడానికి గల ప్రధాన కారణం కాకినాడ కార్పోరేషన్ సిటీ ప్లానింగ్ విభాగ అధికారుల నిర్లక్ష్యం వలన అగచాట్లు ఏర్పడుతున్నాయి. మాఫీయా టీమ్ నిర్వహణ వలన జోరుగా అక్రమ భవంతులు ఏర్పడు తున్నాయన్నారు. సమీక్షలు అజమాయిషీ సస్పెన్షన్ మెమో వంటి చర్యలు శూన్యం కావడం వలన లెక్కచేయని పరిస్థితి కార్పోరేషన్ లో వుందన్నారు. ఫ్లెక్స్ ఫ్రీ సిటీ నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అమలు చేయడంలో విఫలం చెందిన అధికారులపై ఎటువంటి చర్యలు లేకపోవడం తగదన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి