పిఫోర్ పూర్ టు పావర్టీ ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నాటి నుంచి ఈనాటి వరకు పిఫోర్ కార్యక్రమ నిమిత్తం సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి కూటమినేతలకు పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు.
ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.
ఎన్టీఆర్ జిల్లా/చందర్లపాడు మండలం : 29 ఏప్రిల్ 2025.
చందర్లపాడు మండలం : ముప్పాళ్ళ గ్రామం నందు మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు అధికారులు మరియు కూటమినేతలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఇటీవల ముప్పాళ్ళ గ్రామ పర్యటనలో భాగంగా పిఫోర్ కార్యక్రమంలో బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శకాల సహకారంతో ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబ పోషణ కొరకు ఆటో కుట్టుమిషన్లు ఎంప్లాయిమెంట్ కార్డ్ మెడికల్ కిట్లు మరియు ఇంటి స్థలమును లబ్ధిదారులకు అందజేసిన ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలనతో దూసుకుపోతోందని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన కొనసాగుతోందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు హృదయపూర్వక పాదాభివందనాలు మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి జీవన ఉపాధి నిమిత్తం ఈరోజు ఇంతటి మహత్ కార్యక్రమాన్ని నిర్వహించుకొనడం చాలా సంతోషం. మార్గదర్శకులు క్రక్స్ బయోటెక్ మరియు సేంతిని బయో ప్రొడక్ట్స్ వారు బంగారు కుటుంబాలైన పగడాల నాగరత్నమ్మ భర్త తంబి, కొండ్రు వెంకటరవమ్మ భర్త వెంకటేశ్వర్లు లకు ఆటోలను అందించారు. కొండ్రు వెంకటరావుమ్మ గారికి నివాసము కొరకు 0.03 సెంట్ల ఇంటి పట్టాను అందజేయడం జరిగినది. మహిళల జీవనోపాధికి ఎంతో వెసులుబాటుగా ఉండే కుట్టు మిషన్ (జిగ్ జాగ్ మిషన్ మోటారుతో) లను పగడాల నాగరత్నమ్మ, కొండ్రు వెంకటరావమ్మ, ఉప్పెల్లి నాగజ్యోతి, బొబ్బ శ్రీలక్ష్మి, పగడాల ప్రియాంక, బోలీనిడి శిరీష లకు అందజేయడం జరిగినది. యువత ఉపాధికై వారికి మార్గదర్శకులు శ్రీమతి ఈ అనురాధ అంబా కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కే లక్ష్మయ్య తండ్రి పెద్ద కొండలు, శ్రీమతి రమాదేవి భర్త లక్ష్మయ్యకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అలానే ఆరోగ్య అవసరాల నిమిత్తము కోటా పుష్పమ్మ భర్త శ్రీహరి, దాచేపల్లి కాలిమ్మ భర్త భద్రయ్య, జమ్ముల అనంతరామయ్య తండ్రి చౌదరయ్య, నల్లాని అప్పమ్మ భర్త నరసింహయ్య, నల్లని సావిత్రి భర్త కోటేశ్వరరావు, నల్లని వెంకాయమ్మ భర్త సుబ్బారావు, రావూరి సీతారావమ్మ భర్త వెంకటేశ్వర్లు, రాయల వీరమ్మ భర్త పుల్లయ్య, చెరుకూరి ఈశ్వరమ్మ భర్త నాగేశ్వరరావు లకు మెడికల్ కిట్లను అందజేశారు. చెప్పిన మాట చెప్పినట్లుగా నెరవేర్చడమే కూటమి లక్ష్యమని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు మార్గదర్శకుల ద్వారా బంగారు కుటుంబాలకు అందజేసిన ఈ విలువైన గృహపకరణాలు జీవనోపాధి నిమిత్తం ఆటోలు కుట్టుమిషన్లు మెడికల్ కిట్లు ఎంప్లాయిమెంట్ కార్డులని తంగిరాల సౌమ్య గారు తెలియజేశారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి