భూ సమస్యలకు మళ్లీ అప్లై చేయాల్సిందేనా?
భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌ను తీసు కొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూ సమస్యలపై ధరణిలో చేసుకున్న అప్లికేషన్లను రిజెక్ట్ అవుతున్నాయి.
భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రావడం, అలాగే, కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత దరఖాస్తులు తిరస్కర ణకు గురవుతున్నాయి. దరఖాస్తుదారులు భూ భారతి పోర్టల్‌లోనే మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని అధికారులు అంటున్నారు.
త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సద స్సులు నిర్వహిస్తున్నామని, అందులోనూ మాన్యువల్‌గా దరఖాస్తులు చేసుకోవ చ్చని అన్నారు. తెలంగాణ లో భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చే సమయానికి ధరణిలో 81,000కుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను భూ భారతి పోర్టల్‌కు బదిలీ చేశారు. భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు తహసీల్దార్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయుల్లో అధికారాలను వికేంద్రీకరించడంతో చిన్నపాటి సమస్యలలు తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం అవుతాయి.
దీంతో ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. అయినప్పకటికీ అధికారు లు కారణాలు చెప్పకుండా నే పాత దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రిపోర్ట్లు సైతం పెట్టకుండానే తిరస్కరిస్తు న్నట్లు తెలుస్తోంది.
గతంలో పరిష్కారం కాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖా స్తులు చేసుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు.
భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తు ను భూ భారతి చట్టంలోని నిబంధనల కిందే పరిష్కరించాల్సి ఉంది. ఏ దరఖాస్తును తిరస్కరిం చినా సరైన కారణం చెప్పాలి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి