చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కునచ్చుల మహేందర్ వృత్తిరీత్యా చేపపిల్లల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, చిగురుమామిడి మండలానికి చెందిన రౌడీషీటర్ గీకురు రవీందర్ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ, లేకపోతే చంపుతానని పలుమార్లు బెదిరించి, చేపల చెరువు మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తానని పత్రికల్లో విషప్రచారం చేస్తూ, ఆగస్టు 22వ తేదీన తన చెప పిల్లల చెరువుల దగ్గర కూలీలతో పని చేయిస్తుండగా, రౌడీ షీటర్ గీకురు రవీందర్ తన డ్రైవర్ తో కలిసి, తన చేపల చెరువుల దగ్గరికి వెళ్లి అతనిని కొట్టి, చంపుతాను బెదిరించడం తో అతను ప్రాణభ్రయంతో పారిపోయి, స్థానిక చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చిగురుమామిడి S.I గారు విచారణ జరిపి , అతని పై హత్యయత్నం చేసిన రౌడీ షీటర్ గీకురు రవీందర్ పై IPC 351, 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
రౌడీషీటర్ మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్ చిగురుమామిడి మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు మరియు బలవంతపు వసూళ్ళుకు పాల్పడుతూ, కొంతమంది రౌడీషీటర్లతో ముఠాగా ఏర్పాడి, ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం మరియు లేడీ గవర్నమెంట్ టీచర్ ను వేధించడం మరియు చంపుతానని బెదిరించడం వీరికి నిత్యకృత్యం అయిపోయింది. అనునిత్యము చిగురుమామిడి మండల ప్రజలని పట్టి పీడిస్తున్నటువంటి ఈ నరరూప రాక్షసున్ని కరీంనగర్ సీపీ గారు ప్రత్యేక చొరవ చూపి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరడం జరుగుతుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి