(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); వైయస్ఆర్సీపీ పార్టీల వరస రాజీనామాలతో సతమతమవుతున్న వైసిపి - మల్లెలన్యూస్ వైయస్ఆర్సీపీ పార్టీల వరస రాజీనామాలతో సతమతమవుతున్న వైసిపి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, ఆగస్టు 2024, శనివారం

    వైయస్ఆర్సీపీ పార్టీల వరస రాజీనామాలతో సతమతమవుతున్న వైసిపి




    YCP: వరుస రాజీనామాలతో వైసీపీ సతమతం.

    ఇప్పటికే పార్టీని వీడిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరికొందరు పార్టీని వీడుతారనే ప్రచారం

    వైసీపీకి కష్టకాలం దాపురించింది. శాసనసభ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమవడం, రోజురోజుకీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణ ఘటనలు బయటకు వస్తుండడంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడి సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మరో ఇద్దరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు. వరుసగా పార్టీకి, పదవులకు రిజైన్ చేస్తూ వైసీపీ మనుగడ కొనసాగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా పార్టీ పరిస్థితి మారింది. 2019లో 151 సీట్లు సాధించి ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పార్టీయేనా ఇంత త్వరగా ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

    వారే మిగులుతారా..

    పార్టీ నుంచి ఇంత మంది ప్రజాప్రతినిధులు వెళుతున్నా.. ఆధిష్టానం సీరియస్గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా చాలా కాలం పాటు జగన్ వెన్నంటి ఉన్న నాయకులైన మోపిదేవి, బీద మస్తాన్రావు, గొల్ల బాబూరావు తదితర నేతలు పార్టీ వీడుతుండడం ఆశ్చర్యకరంగా మారింది. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇప్పటికే 2 రాజీనామా చేశారు. అదే రూట్లో మరికొంత మంది ఉన్నట్టు తెలుస్తోంది. చివరకు లోక్సభలో మిధున్రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య, అయోద్యరామిరెడ్డే మిగిలేలా ఉన్నారు. ఇటు ఎమ్మెల్సీలు కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. వెళ్లే వాళ్లంతా త్వరలోనే పశ్చ్యతాప పడే రోజులు వస్తాయని వైసీపీ నాయకులు అంటున్నారు.


    అలాగే పార్టీ నుంచి పోతున్నావారితో పాటు మరికొంత మంది పార్టీ వీడుతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే పార్టీలోని కొందరు పెద్దలు అప్రమత్తమయ్యారు. పార్టీ నుంచి పోతున్నారని ప్రచారం జరుగుతున్న వారంతా ఖండించాలని వైసీపీ అధిష్టానం సూచించింది. దీంతో విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రెస్మీట్ పెట్టారు. వైసీపీకి ద్రోహం చేయమని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఇంకా మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి,గొల్ల బాబూరావు సహా మిగిలిన ఎంపీలు స్పందించలేదు. మరో వైపు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. శుక్రవారం.. కర్రి పద్మ, బల్లి కల్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చేశారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వైయస్ఆర్సీపీ పార్టీల వరస రాజీనామాలతో సతమతమవుతున్న వైసిపి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top