(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పందెం కోళ్లను వేలం వేసిన పోలీసులు - మల్లెలన్యూస్ పందెం కోళ్లను వేలం వేసిన పోలీసులు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, ఆగస్టు 2024, మంగళవారం

    పందెం కోళ్లను వేలం వేసిన పోలీసులు





    *పందెం కోళ్లను వేలం వేసిన పోలీసులు 



    పెద్దపల్లి జిల్లా: ఆగస్టు06
    పందెం రాయుళ్లు కోడిపుంజులను పందేలకు సిద్ధం చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నప్పడు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు..

    ఈ సందర్భంగా అక్కడ పందెంలో ఉంచిన రెండు కోళ్లను స్వాధీనం చేసుకు న్నారు పోలీసులు. ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. 

    అయితే కేసును విచారించి నిందితులకు జరిమానా వేసిన జడ్జి పందెం కోళ్లను వేలం వేయాలని తీర్పు ఇచ్చారు. దీంతో పోలీసులు ఈరోజు వేలం వేశారు. 

    ఇదినిజమండి బాబు.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ లో మంథని కోర్టు ఆదేశాల తో కోళ్లను ఠాణాకు తీసుకొచ్చిన పోలీసులు వాటి కోసం ప్రత్యేక బోను ఏర్పాటు చేశారు. 

    నిత్యం దాణా, నీటిని అందించారు. కోర్టు ఆదేశాలతో పందెం కోళ్లను కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం వేలం పాట నిర్వహించారు పోలీసులు.. ఈ వేలంపాటలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 

    మొదటి పందెం కోడి 2 కిలోల 980 గ్రాముల బరువు ఉండగా... దాన్ని 4 వేల రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు కమాన్‌పూర్‌‌కు చెందిన పురాణం సారయ్య. 

    రెండో కోడి 2 కిలోల 410 గ్రాములు ఉండగా దాన్ని 2 వేల 500 రూపాయలకు కమాన్‌పూర్‌కు చెందిన బోనాల సత్తయ్య వేలంలో దక్కించుకున్నాడు. 

    పందెం కోడి టేస్టీగా ఉంటుం  దని అందుకే వేలంలో కమాన్‌పూర్ గ్రామస్తులు దక్కించుకు న్నారనుకుంటే పొరపాటే.. వేలంలో దక్కించుకున్న కోళ్లను బ్రీడ్ కోసం.. తమ ఫామ్‌లో పెంచుతామంటున్నారు వేలంలో దక్కించుకున్న ఆ ఇద్దరు కమాన్‌పూర్ గ్రామస్తులు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పందెం కోళ్లను వేలం వేసిన పోలీసులు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top