(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); చంద్రబాబు కష్టమంతా ప్రజలకోసమే. : ప్రత్తిపాటి - మల్లెలన్యూస్ చంద్రబాబు కష్టమంతా ప్రజలకోసమే. : ప్రత్తిపాటి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    9, అక్టోబర్ 2026, శుక్రవారం

    చంద్రబాబు కష్టమంతా ప్రజలకోసమే. : ప్రత్తిపాటి




    చంద్రబాబు కష్టమంతా ప్రజలకోసమే. :  ప్రత్తిపాటి

    • జగన్ పాలనలో ప్రభుత్వ గొప్పలు.. ప్రజలకు అప్పులే మిగిలాయి.
    • రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని విమర్శించే వైసీపీనేతలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లిచూస్తే వాస్తవాలు బోధపడతాయి.
    • లింగారావుపాలెంలో పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి.

    జగన్ పాలనలో ప్రభుత్వ గొప్పలు.. ప్రజలకు అప్పులే మిగిలాయని, మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులు అన్యాక్రాంతమై.. రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారయ్యేదని,  వయసుని, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా నేడు చంద్రబాబు  పడుతున్న కష్టమంతా ప్రజలకోసమేనని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. 

    శుక్రవారం ఆయన యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో పల్లెపండుగ 2.0, 3.0 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత స్థానిక బీసీ కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించిన ప్రత్తిపాటి. అనంతరం ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పాడి రైతులకు రూ.3 లక్షల విలువైన సంగం డెయిరీ బోనస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. 

    *అత్తెసరు సంక్షేమంతో.. జగన్ వేల కోట్లు కొల్లగొట్టాడు.*
    జగన్ ఐదేళ్లు అత్తెసరు సంక్షేమాన్ని ప్రజలకు అందించి.. వేలకోట్లు కొల్లగొట్టాడని, ఆయన చేసిన అప్పులు తీరుస్తూనే, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అవసరమైన సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధిని కొనసాగిస్తున్నారని ప్రత్తిపాటి వివరించారు. తల్లికి వందనం పథకం అమలును ప్రభుత్వం, మంత్రి నారాలోకేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, జగన్ లా ఒకరికే ఇచ్చి, తల్లుల్ని మోసగించడం లేదన్నారు. చంద్రబాబు అనుభవానికి ప్రధాని మోదీ సహకారం తోడైనందునే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతోందన్నారు. లింగారావుపాలెం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామ రూపురేఖలు మారుస్తామని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. లింగారావుపాలెం గ్రామ మహిళలకు ఉన్న చైతన్యం.. మరెవరికీ లేదన్నారు.  కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించే గొడ్డలిపార్టీ నేతలు... ఆ పార్టీ సానుభూతిపరులు ఇతర రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని చూస్తే.. వారికి వాస్తవాలు బోధపడతాయని ప్రత్తిపాటి సూచించారు. 

    కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు పావులూరి శ్రీనివాసరావు, శ్రీనివాస్ రెడ్డి,  తోకల వీరయ్యా, కట్టా శ్రీహరిరావు, నంబూరి కృష్ణారావు, మురుకోట్ల శ్రీధర్ కుమార్, సాధినేని సుధీర్, తోకల రాజేష్, బుజ్జి, ఆలోకం వీరనారాయణ, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబు కష్టమంతా ప్రజలకోసమే. : ప్రత్తిపాటి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top