(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు* - మల్లెలన్యూస్ అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, మే 2026, మంగళవారం

    అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*




    *అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*

    *పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.*

    ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్ర‌మంలో టాస్క్ ఫోర్స్ సీఐ భీమ నాయక్  ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య మరియు సిబ్బంది కలసి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమరాజు పల్లి గ్రామ సమీపంలో కోత ముక్క పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.65,500/- నగదు మరియు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 
     జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు...
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top