*ఇండ్ల గణనను పారదర్శకంగా చేపట్టాలి*
*నరసరావుపేట లోని రామిరెడ్డి పేటలో ఇంటిఇంటికి వెళ్లి జనగణనను పరిశీలించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ*
జిల్లాలో జనగణనలో భాగంగా చేపట్టిన ఇండ్లగణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రామిరెడ్డి పేటలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఇండ్లగణనను మంగళవారం ఇంచార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివరాలు అందిస్తున్న ప్రజలతో మాట్లాడారు. గణన చేస్తున్న సిబ్బంది వివరాలను అడుగుతున్న తీరు, సిబ్బంది హెచ్ ఎల్ బి యాప్ లో వివరాలను నమోదు చేస్తున్న తీరుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇండ్లగణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకు అనుగుణంగా ఇండ్లగణనను వేగవంతం చేయాలన్నారు. గణన సిబ్బందికి రోజూ వారీ నిర్దేశించిన లక్ష్యాల మేర, ఏ రోజు లక్ష్యాన్ని అదేరోజు పూర్తి చేయాలన్నారు. ఇండ్లగణన చేసే సిబ్బంది ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, అవసరమైన మేరకే వివరాలను తెలుసుకుని యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి