(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); విజయ్- రష్మికకి పెద్దాయన ఆశీస్సులు.. పెళ్లి తర్వాత ఫస్ట్ ఆ సెలబ్రిటీ ఇంటికే - మల్లెలన్యూస్ విజయ్- రష్మికకి పెద్దాయన ఆశీస్సులు.. పెళ్లి తర్వాత ఫస్ట్ ఆ సెలబ్రిటీ ఇంటికే - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    28, ఫిబ్రవరి 2026, శనివారం

    విజయ్- రష్మికకి పెద్దాయన ఆశీస్సులు.. పెళ్లి తర్వాత ఫస్ట్ ఆ సెలబ్రిటీ ఇంటికే


    విజయ్- రష్మికకి పెద్దాయన ఆశీస్సులు.. పెళ్లి తర్వాత ఫస్ట్ ఆ సెలబ్రిటీ ఇంటికే

    టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు ఎట్టకేలకు భార్యాభర్తలుగా తమ జీవితంలో కొత్త ఛాప్టర్ ప్రారంభించారు. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని అందమైన మెమెంటోస్ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్ దేవరకొండ. ఉదయం 10.10 గంటలకు తెలుగింటి సాంప్రదాయం ప్రకారం.. సాయంత్రం కొడవ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్, రష్మికలు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో షేర్ చేశారు. తాజాగా పెళ్లి జరిగిన వెంటనే విజయ్ - రష్మిక దంపతులు నేరుగా ఓ ప్రముఖ వ్యక్తిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే విజయ్ - రష్మికల పెళ్లితో గత కొంతకాలంగా వినిపిస్తోన్న ఊహాగానాలకు, వార్తలకు చెక్ పడింది. ఇద్దరూ వైవాహిక బంధం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. పెళ్లి తర్వాత అత్తారింటిలో అడుగుపెట్టనున్న రష్మిక.. కొత్త జీవితంపై ఎన్నో ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక భార్య గురించి చెబుతూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను.. ఆమె ఉండి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది, నేను ఎక్కడా ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతనను ఇచ్చే ఇల్లు తనే. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌ని నా భార్యగా చేసుకున్నాను అని విజయ్ రాసుకొచ్చారు అటు రష్మిక కూడా తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానని ఎమోషనల్ అయ్యింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో విజయ్ నాకు నేర్పించారు. ప్రశాంతంగా ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి, జీవితంలో నేను అనుకున్నది సాధించగలనని చాటిచెప్పిన వ్యక్తి. ఆయన గురించి నేను పుస్తకం రాయగలను, విజ్జూ నీ పట్ల నాకున్న భావాలను చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. నా జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, విచారం అన్నీ నీకు తెలుసు. ఇది మన జీవితంలో అతిపెద్దది, నేను నీతో ఉన్నా.. నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని రాసుకొచ్చింది ఇదిలాఉండగా.. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు మూడు రోజుల పాటు ఉదయ్‌పూర్‌లోనే ఎంజాయ్ చేశారు. వారి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రిసెప్షన్ ఏర్పాట్లను చూసుకుంటారు. పెళ్లి సింపుల్‌గా చేసుకున్నప్పటికీ.. స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానుల కోసం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో మార్చి 4వ తేదీన రాత్రి 7 గంటలకు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: విజయ్- రష్మికకి పెద్దాయన ఆశీస్సులు.. పెళ్లి తర్వాత ఫస్ట్ ఆ సెలబ్రిటీ ఇంటికే Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top