సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయ సిబ్బంది శనివారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అనిశా (అవినీతి నిరోధక శాఖ)కు చిక్కారు.
* అనిశా ఏఎస్పీ విమలకుమారి విలేకరులకు వెల్లడి
వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్కే 0.99 సెంట్ల పొలం ఉంది. దాన్ని విక్రయించడానికి ప్రయత్నించగా అందులో 0.66 సెంట్లు పోరంబోకు స్థలంగా రికార్డులో చూపించారు. ఆ స్థలం కోసం పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేశారు. ఆర్డీవో కార్యాయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, ఆర్డీవో సీసీ హేమంత్ పట్టా కోసం రూ.60 వేలు డిమాండ్ చేశారు. చివరికి ప్రైవేటు వ్యక్తి అయిన మెకానిక్ వెంకటసుబ్బయ్యకు రూ.40 వేలు ఇవ్వమన్నారు. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు మెకానిక్కు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి