కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ ను దత్తత తీసుకుంటా:ఖమ్మం MP గౌ శ్రీ రామసహాయం రఘురామిరెడ్డి
CPM పార్టీ బలపరిచిన 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల.ఉమారాణి చేతిగుర్తుకు ఓటేసి గెలిపిస్తే 60వ డివిజన్‌ను స్వయంగా దత్తత తీసుకుని, MPLADS (ఎంపీ నిధుల) ద్వారా రెండు తాగునీటి బోర్లు మంజూరు చేయించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి 60వ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చుతాను.అర్హులైన ప్రతి ఒక్కరికీ 75 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మించి ఇస్తాము. తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణ సమాచార శాఖల మంత్రి వర్యులు గౌ శ్రీ పొంగులేటి.శ్రీనివాసరెడ్డిగారితో మాట్లాడి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థలాల పట్టాలను త్వరితగతిన లబ్ధిదారులకు అందజేస్తాను. ప్రత్యేక నిధులను కేటాయించి ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతులు మరియు వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారంనికి కృషి చేస్తాను.హస్తంగుర్తుపై పోటీ చేస్తున్న శ్రీమతి కాసుల ఉమారాణి గారిని గెలిపించడం ద్వారా ఈ అభివృద్ధి పనులు చేయడం సాధ్యపడుతుందని హామీఇచ్చి చేతిగుర్తుకు మీ అమూల్యమైన ఓటువేసి గెలించాలని అభ్యర్థించారు.
కాసుల.ఉమారాణి వెంకట్ మాట్లాడుతూ గత 25 సం,,లుగా కొత్తగూడెం పట్టణప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టనష్టాలలో అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ, రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులకు అందిస్తూ ప్రతిఫలం ఆశించకుండా సేవసేసే కుటుంబానికి, నీతిగా నిజాయితీగా ఉండే మీ మట్టిమనిషి చేతిగుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అధికారంలోలేనివారు, గారడి మాటలతో, మోసపూరిత కుట్రలతో, డబ్బుసంచులతో మిమ్మల్ని అయేమయం గందరగోళం చేసి ఓటు వేయించుకోవాలని ఐదంతస్తుల భవంతిలోనుండి వచ్చి ఓటేయ్యాలని అడుగుతారని, గెలిచిన తర్వాత వారి ఇంటిగేటు కూడా తాకనివ్వరని, ఐదోఅంతస్తు ACగదిలో ఉండి ఇంట్లో లేరు అని వాచ్మెన్ తో చెప్పిస్తారని, ప్రతి పనికి రేటు కట్టి పిడించేవారికి మాటలు నమ్మి మోసపోకుండా మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి కాసుల.ఉమారాణిని గెలిపించి 60వ డిజనన్ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవి ప్రసన్న, కూచిపూడి.జగన్, పూణెo.శ్రీనివాస్, సర్పంచ్ లైలా, ఉప సర్పంచ్ మహేష్, ఐకి.సత్యనారాయణ, జయప్రకాష్, ఆకుల.సుధాకర్, కాసుల.సాయి, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి