ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో 32 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,58,951 కి చేరింది. మొత్తం 61,112 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 43,983గా ఉంది. ఇప్పటివరకు 7,08,712 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,256 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి