పుల్లలచెరువు మండల టీడీపీ నాయకులు గజ్వల్లి. భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్బంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో భాగంగా విశ్వావసు నామ సంవత్సరంలో రైతాంగానికి మేలు జరుగుతుందని, పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని పండితులు ములకలపల్లి. మధు, గోవర్ధనా చార్యులు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరం ప్రజలందరికి మేలు చేయనుందని, అయితే అందరూ అప్రమత్తంగా ఉంటూ కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు.గ్రామ పెద్దలు గజ్వల్లి. శ్రీను, రఘు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి