(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడ్కో హౌసింగ్ కాలనీలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమం - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడ్కో హౌసింగ్ కాలనీలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    2, నవంబర్ 2026, సోమవారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడ్కో హౌసింగ్ కాలనీలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమం





    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడ్కో హౌసింగ్ కాలనీలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమం

    చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని 52 ఎకరాల టిట్కో హౌసింగ్ కాలనీలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

    స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి సతీమణి శ్రీమతి ప్రత్తిపాటి వెంకట కుమారి గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆమె కాలనీలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జమ్మి చెట్టు యొక్క ఆధ్యాత్మిక, ధార్మిక ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.

    ఈ పూజా కార్యక్రమం ద్వారా టిట్కో హౌసింగ్ కాలనీలోని సర్వదోషాలు తొలగిపోయి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు శ్రీమతి ప్రత్తిపాటి వెంకట కుమారి తెలిపారు.

    ఈ కార్యక్రమంలో టిట్కో హౌసింగ్ కాలనీకి చెందిన భక్తులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారిలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు  ఇట్టే శివ నాగేశ్వరరావు, మల్లెల శివ నాగేశ్వరరావు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్, ఆచ్చుకోల మురళి తదితరులు పాల్గొన్నారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడ్కో హౌసింగ్ కాలనీలో జమ్మి చెట్టు పూజా కార్యక్రమం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top