(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); దుర్గాష్టమి రోజున శమీ వృక్షం పాలపిట్ట దర్శనం శుభం - మల్లెలన్యూస్ దుర్గాష్టమి రోజున శమీ వృక్షం పాలపిట్ట దర్శనం శుభం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, అక్టోబర్ 2024, శనివారం

    దుర్గాష్టమి రోజున శమీ వృక్షం పాలపిట్ట దర్శనం శుభం






    విజయదశమి రోజున శమీ వృక్ష పూజ, పాల పిట్ట దర్శనం

    శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
    అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

    దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.

    *'శమీ పూజ'* చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుదములను , వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న *'అపరాజిత'* దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .

    విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి. పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

    *‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ , అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా , ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా , తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

    పాలపిట్ట దర్శనం ఎందుకు?

    పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజు శ‌మీ వృక్షంపై ( జమ్మి చెట్టు) ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణానికి ఉద్యుక్తులు కాగా ఆ స‌మ‌యంలో వారు ఎదురుగా వచ్చిన పాల‌పిట్ట‌ను చూస్తారు. అప్పటి నుండి పాండవులకు అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు.  అప్పటి నుండి ద‌స‌రా రోజున ( విజయదశమి రోజున) పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

    ఓం దుం దుర్గాయై నమః
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దుర్గాష్టమి రోజున శమీ వృక్షం పాలపిట్ట దర్శనం శుభం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top