నరసన్నపేట - ఇచ్చాపురం రోడ్డు 6లైన్లుగా మార్చాలి
పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయం వద్ద వయోడెక్ట్ నిర్మించాలి - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
నీలమణి అమ్మవారి గుడి దగ్గర రోడ్డు డిజైన్ మార్పు చేయాలి
న్యూ ఢిల్లీ : నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక భేటీ
పాతపట్నం వద్ద నిర్మిస్తున్న ఆర్ఓబి కారణంగా నీలమణి అమ్మవారి గుడి ప్రాంగణం ఎర్త్ వాల్ వల్ల మూసుకుపోవటం భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని 110 మీటర్ల విడక్ట్ నిర్మాణం చేపట్టి ఆలయానికి నేరుగా వెళ్లే లాగా మార్గం అందించాలని కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి ని రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా కలిసి విన్నవించారు. దీనికి సుమారు 8 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
జిల్లా నుండి సాగే జాతీ రహదారి 16 నరసన్నపేట వరకే ఆరు వరసలుగా ఉందని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఉన్న రద్దీ దృశ్య నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు ఆరవరుసలగా విస్తరించాలని కేంద్ర మంత్రని కోరారు.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి