పోలీసింగ్ , ప్రజాసేవలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అన్వేషించడమే "AI హ్యాకథాన్" లక్ష్యం -డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
మంగళగిరి: పోలీసింగ్,ప్రజాసేవలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అన్వేషించడమే "AI హ్యాకథాన్" కార్యక్రమ లక్ష్యం అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా "AI హ్యాకథాన్" కార్యక్రమాన్ని ఈ నెల 27, 28, 29వ తేదీలలో గుంటూరు ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న సంగతి విదితమే. ఈ "Al హ్యాకథాన్'కు సంబంధించిన వెబ్ సైట్, ప్రోమోను మంగళగిరి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగాజరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ "AI హ్యాకథాన్" కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని తెలిపారు. పోలీసింగ్, ప్రజాసేవలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ "AI హ్యాకథాన్" నిర్వహించబడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్ కు అనుగుణంగా పరిపాలనలో ఆధునిక సాంకేతికతను అమలు చేయాలనే సంకల్పంతో ఈ "AI హ్యాకథాన్" నిర్వహించడం జరుగుతుందన్నారు. శాస్త్రీయంగా, ఆచరణాత్మకంగా ఉండే AI పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక వ్యూహాత్మక వేదికగా నిలవనుందని డీజీపీ తెలిపారు.జాతీయస్థాయిలో నిర్వహించబడుతున్న ఈ "AI హ్యాకథాన్" లో దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, పేరెన్నిక గన్న విద్యాసంస్థలు, స్టార్టప్స్ నుండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎంట్రీలను ఆహ్వానిస్తోందన్నారు. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నాయన్నారు. ఈ "AI హ్యాకథాన్" కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ "AI హ్యాకథాన్"లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన బృందాలకు సర్టిఫికెట్, నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. "AI హ్యాకథాన్" అవార్డుల ఎంపిక కమిటీలో సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐటీ నిపుణులు, అకడమిక్ పరిశోధకులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఎంపికైన బృందాలకు ఉచితంగా వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ సేవలలో AI సామర్థ్యాలను వినియోగించేందుకు ఈ కార్యక్రమం కీలకమైన మైలురాయి కానుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. విజన్ కలిగిన A1 బృందాలు, ఐటీ సంస్థలు, స్టార్టప్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి