అమ్మ శ్రీకాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు నిత్యవసర సరుకులు పంపిణీ
ఆవుల రాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు కౌటాల మండలం పార్డి గ్రామానికీ చెందిన మడావి దివాకర్(36), భారతి ఇద్దరు అనారోగ్యము కారణంగా చనిపోయారు.
వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల పాలన కోసం దివాకర్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
దివాకర్ రెండో భార్య శారదా రెండు నెలల క్రితం మగ బిడ్డకు జన్మినిచ్చి చనిపోయింది.
విషయం తెలుసుకున్న
సండ్ గాం యూత్ సభ్యులు
అమ్మ శ్రీకాంత్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కుటుంబ సభ్యులను పరామర్శించి, నిత్య అవసర సరుకులను అందించడం జరిగిందని సామాజిక కార్యకర్త దొబ్బల మంగేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు,
సాయినాథ్, గోపాల్, ఇగురపు వెంకటేష్, సందీప్,
బన్నీ, రాకేష్, రాష్ట్రపల్, సాయి, గణేష్, అంజి, గణేశ్, పవిత్ర కుమార్, మనిష్, నిశాంత్, శ్రీకాంత్, కార్తీక్, ప్రవీణ్, మల్లేష్, శ్రీహరి మరియు యువకులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి